గురువారం 10 నవంబర్ 2011

స్త్రీ

స్త్రీ -- , త, ర, ఈ -- అనే అక్షరముల కలయిక.
-- సత్వ గుణం, - తమో గుణం , - రజో గుణం లను దాటించి '' - ఈశ్వరునికి చేరువ చేసేదే -- "స్త్రీ".
స్త్రీ ని యోగ వస్తువు గా చూడాలే కాని, భోగ వస్తువు గా కాదు.

శుక్రవారం 18 ఫిబ్రవరి 2011

శ్రీ శ్రీ శ్రీ మహా కాళీ సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

వికృతి నామ సంవత్సర మాఘ పౌర్ణిమ Feb 18, 2011 మఖ నక్షత్ర యుక్త శుక్రవారం శ్రీ శంకరాచార్యుల సమక్షం లో
శ్రీ శ్రీ శ్రీ మహా కాళీ సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుపుటకు దేవతలు శుభ ముహుర్థం నిర్ణయించినారు. అందులోను ఈ రోజు భైరవి మాత జయంతి.
సత్యాన్వేషకులు అందరూ ఈ రహస్య ఉత్సవము తిలకించుటకు సిద్ధము గా ఉండండి.
ఈ రోజు అందరూ చక్కగా సాధన చెయ్యండి. ముందుకు పురోగమించండి.

శనివారం 12 ఫిబ్రవరి 2011

మరణం

ఎవరికి ఎవరం
ఒకరికి ఒకరం
చివరకి అందరం
కలిసే చోటు ...... మరణం...!



శనివారం 8 జనవరి 2011

కంచి కామాక్షి - దర్సనం

కాలు కదలదు, కను రెప్ప వాలదు
చలనము లేని శివుడనైతిని తల్లి
నీ దివ్య రూపమును గాన్చి..ఓ కంచి కామాక్షి.

అందమైన కాంతలు వద్దు
వేన్నోళ్ళ పొగిడే కీర్తి వద్దు
ధగ ధగ మెరిసే కనకములు వద్దు
సర్వ కామములు నీ కాలి గోటికైనను సరితూగవు,
నాకు నీవొక్క దానివి చాలు..ఓ కంచి కామాక్షి.

చంద్రబింబము వంటి ముఖమని
పొగిడెదరు జనులెల్ల స్త్రీ సౌందర్యమును
చంద్రుడినే శిఖను దాల్చిన నీ సౌందర్యమును
యేమని పొగడవలెనో.....ఓ కంచి కామాక్షి.

కన్నులు ఉన్నవి రెండు,చూచేది ఒక్కటే
నిన్ను చూచుటకు రెండు కనులు చాలవు
శివుడి  జ్ఞాన నేత్రమొకటి  అరువు కావలె..ఓ కంచి కామాక్షి...!

శనివారం 1 జనవరి 2011

పాలెం సుందర గజ్జల లక్ష్మి నరసింహ దర్సనం

స్వామి పాద పద్మముల మువ్వల సవ్వడి హృదయమున తాకిన క్షణం కరుణా మయుడు అయిన స్వామి తన దర్సన మిచ్చాడు , 200 సంవత్సరములు నుండి దాచిపెట్టిన తన గజ్జలను చూపించి తన ప్రేమ అమృతాన్ని నా చేత ఆస్వాదింప చేసాడు , ఆ సత్యం తెలిసిన మరుక్షణం కన్నుల నిండా ఆనంద భాష్పములే , ఇంకా పలుకుటకు మాటలు రావడం లేదు , హృదయం జల ధారను కురిపిస్తోంది , జై నరసింహ జై జై నరసింహ గజ్జల నరసింహ సుందర నరసింహ ....."పెట్టుకో శక్తి నీ బ్లాగ్ లో నా పలుకులను స్వామి మొదటి సత్య వాక్యము గా" అంటూ శివుడు నాకు తన ఆజ్ఞ ను ఇచ్చాడు.


యమునా ప్రవాహమా !
200 సంవత్రముల నుంచి శిలనై ఉన్న నన్ను నీ మధుర రాగ ప్రవాహంతో అభిషేకిన్చావు ! నీ కీర్తన నాదం తోనే  నా వామ ఊరువు పైన నా లక్ష్మి కి మానస పుత్రుడై వచావు !  నా కనుల జల ధారా  కనులార నిన్ను నింపుకొని వుంది !  మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోయావు కాని నీ రాగం నన్ను ఇంకా అభిషేకిస్తూనే వుంది , అది అఖండ రాగం !

శుక్రవారం 24 డిసెంబర్ 2010

"సత్యాన్వేషి" - కొత్త గ్రూప్ మొదలయ్యింది.

మిత్రులారా. "సత్యాన్వేషి" పేరుతో కొత్త గ్రూప్ మొదలైంది.
గ్రూపు వెబ్ సైటు :
http://groups.google.com/group/satyanveshi
ఈ రోజు శుక్ర వారము. అమ్మ కు ఎంతో ఇష్టమైన దినము. యాదృచ్చికము గ ఈ రోజు నేను తల్లితండ్రులతో కలసి  "చండి హోమము " లో పాల్గొంటున్నాను. అంతా అమ్మ దయ.

రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండే మిత్రులకు డైరెక్ట్ గా ఇన్విటేషన్ పంపుతున్నాను. జాయిన్ కాగలరు. ఇతరులెవరైనా జాయిన్ కాగోరితే, నాకు ఈ మెయిల్ ( send2vsrao@gmail.com ) చెయ్యండి. వారికీ స్వాగతం చెబుతాను.
ఆ అమ్మ మనందరి సత్యాన్వేషణకు దారి చూపుతుందని ఆశిస్తూ ..!

               మీ సత్యాన్వేషి -- కాళీనరేన్.

శుక్రవారం 26 నవంబర్ 2010

నేనెవడను

నేను  నిరాకారుణ్ణి,నిర్గుణ స్వరూపుణ్ణి.
నేను  నర్తించే  నటరాజును.
నేను  వీరంగం  చేసే వీరభద్రుడను.
నేను  'నేనై ' రమిస్తున్నప్పడు  ఈ ప్రపంచం  అంతా నాలోనే  ఉంటుంది.
నేను "అనేకమై" ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం  అంతట  నేనే  ఉంటాను.

నేను సర్వాకారిణి ,సర్వగుణ విరాజితను.
నేను  దుష్టుల పాలిటి  దుర్గను.
నేను  కన్నెర్ర  చేస్తే  కాళికను.
నేను "అనేకమై" ఉన్నప్పుడు  ఈ ప్రపంచం  అంతట  నేనే  ఉంటాను.
 నేను "ఏకమై " ఉండాలని కామించినపుడు ఈ ప్రపంచం  అంతా నాలోనే  ఉంటుంది.

ఈ ప్రపంచంలో "నేను" వున్నాను, నాలో ప్రపంచం వున్నది.

అసలు  ఇంతకి  "నేనెవడను"

"నేను"  కనులు  మూస్తే  "శివుడిని"  కనులు  తెరిస్తే  "శక్తిని".

సత్యాన్వేషణ - బ్లాగు ముఖ్య ఉద్దేశం

సత్యం.ఆత్మ రూపం లో అందరిలోను నిత్యం రగులుతు ఉండే జ్ఞానాగ్ని.
ఆ అగ్నిమలినం కానిది.ఎవరు మలినం చెయ్యలేనిది.
ప్రతి జీవి లోను ఏదో కావాలని, ఏదో పొందాలని, ఏదో సాదించాలనే ఒక తపన అంతర్లీనము గా జ్వలిస్తూనే ఉంటుంది.
ఈ బ్లాగు వెనక ఉన్న ముఖ చిత్రం యొక్క ఉద్దేశము అదే.

సృష్టి లోని ప్రతి జీవి ఆనందం గా ఉండాలని కోరుకుంటుంది.ఆ ఆనందం కోసమే చనిపోయే వరకు పరుగులు తీస్తుంది.తీరా ఆ ఆనందం బయట ఎక్కడో లేదని,తనలోనే ఆ ఆనందం దాగి ఉందని ఏదో ఒక క్షణం లో తెలుసుకుంటుంది.ఆ క్షణం కోసం చేసే ప్రయాణమే ఈ "సత్యాన్వేషణ".

గొప్ప గొప్ప కార్యాలు అన్ని మంచి ఆలోచనలు,నిర్మలమైన మనసు, పవిత్రమైన హృదయం ఉన్న అనేక శక్తులు ఒకే చోట సమూహం గ చేరినప్పుడు త్వరగ సాధించబడతాయి.
ఈ బ్లాగు ను నేను సృష్టించిన ముఖ్య ఉద్దేశం : అందరిలోనూ ఉన్న ఈ శక్తి ని సమూహం గా చేర్చి ఒక మహాశక్తి గా మలచటానికి.

ఇక్కడ పంచుకునే ప్రతి మాట, ప్రతి భావం, ప్రతి ఆలోచన మరికొంతమందిలో జ్ఞానాగ్నిని రగిలించి సత్యాన్వేషణకు దారి చూపడానికి. ఈ బ్లాగు ఆ సత్యాన్ని అన్వేషించే వారికోసం.ఎవరిలో ఐతే భగవంతుని దర్సించాలన్న తపన,అగ్ని రగులుతూ ఉంటుందో అలాంటి వారికోసం.

ఇది సాధక సింహాల కోసం.

ఈ బ్లాగు లో నేను చర్చించబోయే విషయాలు స్వానుభవాలు మాత్రమె కాకుండా , కొన్ని సేకరించిన విషయాలు కూడా ఉంటాయి.కొన్ని అన్వేషించే ( Research ) విషయాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాలు సాధక అనుభవగ్నులచే పునః పరిశీలించబడిన తరువాతే పంచుకోవటం జరుగుతుంది.

ఈ బ్లాగు లో చర్చించబడిన విషయాలు ఏ ఒక్కరికి ఐన ఉపయోగపడితే, దాని ఫలం అంత నా గురుదేవులకు చెందుతుంది. ఏ విషయమైన సరిగా లేదని భావిస్తే దాన్ని నా అవగాహనారాహిత్యము గా భావించగలరు.


ఈ బ్లాగు ద్వారా ఏ ఒక్కరికి ఐన సత్యాన్వేషణకు దారిచూపగలిగితే దీన్ని సృష్టించిన కార్యం నెరవేరినట్లే....!

        మీ సత్యాన్వేషి -- కాళీనరేన్.